హిందువుల‌కు అతి పవిత్ర‌మైన మాసంలో కార్తీక మాసం ఒక‌టి.. ఈ నెల మొత్తం భ‌క్తులు భ‌క్తి శ్ర‌ద్ద‌లతో న‌దిస్నాన‌మాచ‌రించి ప్ర‌త్యేక‌ పూజ‌లు చేస్తారు..దేశంలో అన్నిశివాల‌యాలు భ‌క్తులు కిట‌కిట‌లాడుతున్నారు.

ఈ క్ర‌మంలో ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీశైలం మల్లికార్జున దేవాల‌యంలో మూడో కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామున నుండి పాతాళ గంగ దగ్గర పుణ్యస్నానాలను భక్తులు ఆచరిస్తున్నారు. ఆలయ రాజగోపురం ఎదురుగా గంగాధర మండపం, ఆలయ ఉత్తర భాగాన భక్తులు పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తున్నారు.

అలాగే..ఈరోజు సాయంత్రం కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి దగ్గర లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు.శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించేందుకు వేలాది మంది భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.