డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న   1997.  నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సినిమాలో అవినీతి పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా విడుదల సందర్బంగా మీడియాతో శ్రీకాంత్ అయ్యంగార్ ఇంటర్వ్యూ విశేషాలు …

ప్ర : 1997 సినిమా మీరు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి ?

జ : మోహన్ గారు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్స్ కొచ్చారు. ఈ కథ ఉంది చెప్పాలని, అయన ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మోహన్ గారు నన్ను బాగా కన్వెన్స్ చేసారు. ఈ కథ నచ్చడంతో చేశాను. ఈ సినిమా ముఖ్యంగా తక్కువ కులం మనుషులను ఇంకో కులం వాళ్ళు తొక్కేయాలని, లేదా నీ రంగు తక్కువ తొక్కువ, నీ దేవుడు కంటే నా దేవుడు గొప్ప అంటూ మనుషులు మనుషులుగా కాకుండా ప్రవర్తిస్తున్నారు. తక్కువ కులం వారిని తొక్కేయాలి, కానీ అదే తక్కువ కులంలో అమ్మాయి అయితే ఆమె పై మొహం కలుగుతుంది. ప్రస్తుతం మన సిస్టం బాగాలేదు. సిస్టం లో క్రైం రేట్ ఎక్కువగా ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టడం ఇలాంటి అంశాల నేపథ్యంలో సినిమా ఉంటుంది. మన సిస్టం లో ఎలాంటి లోపాలు ఉన్నాయి. సామాన్య మనుషులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్న పాయింట్ అప్ వ్యూ లో ఉంటుంది.

ప్ర : ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

జ : ఇందులో నేను కరెప్టెడ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాను. ఈ సినిమా డబ్బింగ్ సమయంలో నా పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఇంత దరిద్రంగా వ్యక్తులు కూడా ఉంటారా ? అని నాకే ఛి అనిపించింది. నిజంగా ఒక నీచ, దారిద్ర, నికృష్ట పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తాను. నిజంగా ఈ పాత్ర నాకు బిన్నంగా ఉన్నప్పటికీ ఆ పాత్ర తాలూకు ప్రవర్తన చూసి నాకే అసహ్యం వేసింది. అంత నీచమైన పాత్ర. కొన్ని ప్రాంతాల్లో ఆ ఊరి ఎస్సై, సి ఐ లే దేవుళ్లుగా ఫీల్ అవుతుంటారు.  

ప్ర : అంటే ఇందులో కులాల గురించి చర్చిస్తున్నారా ?

జ : కాదు .. ఇందులో కేవలం ఒక మనిషి ఎలా మనిషిని అన్నది మరచిపోయి బ్రతుకుతున్నాడు. అవతలివాడిని ఎలా తొక్కాలి, నాదే పైచేయి అనాలి అన్న పాయింట్ తో రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

ప్ర : నటుడిగా మోహన్ గురించి చెప్పండి ?

మోహన్ చాలా గుడ్ పర్సన్, సినిమా అంతే చాల తపన ఉన్న వ్యక్తి.  సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎంత పెట్టాలి అన్న విషయంలో పర్ఫెక్ట్ గా చేసాడు. అలాగే నటుడిగా కూడా చక్కగా చేసారు. ముఖ్యంగా మోహన్ నేను ఎదో హీరో అన్న ఇమేజ్ తో కాకుండా నటుడిగా సత్తా చాటాడు.

ప్ర : వరుసగా భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు ? కెరీర్ ఎలా ఉంది ?

జ : నా నలభై ఏడేళ్లకు నాకు బ్రేక్ వచ్చింది. ముఖ్యంగా బ్రోచేవారెవరురా సినిమాతో నాకు సక్సెస్ దక్కింది. ఆ తరువాత పలు సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో చేస్తున్నాను. హీరో, హీరోయిన్స్ ఫాదర్ రోల్స్, డాక్టర్ గా, పాజిటివ్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు బాగుంది.

ప్ర : నటన పరంగా ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి ?

జ : చాలా మంచి పాత్రలే వస్తున్నాయి, కానీ మూడు తిమింగలాలు దాటుకుని అవకాశాలు రావాలంటే కొంచెం కష్టమే. ఆ మూడు తిమింగలాలు ఒకరు ప్రకాష్ రాజ్, రెండు రావు రమేష్, మూడు మురళి శర్మ. ఈ ముగ్గురు నటులుగా ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు. వాళ్ళను దాటుకుని మనకు ఛాన్సులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు ప్రకాష్ రాజ్ నటన అంటే ఇష్టం. అయన నా పర్సనల్ దేవుడు. అలాగే కమల్ హాసన్ నటన కూడా చాలా ఇష్టం .

ప్ర : దర్శకుడిగా మోహన్ ఎలా తీసాడు ?

జ : మోహన్ దర్శకుడిగా చాలా చక్కగా పనిచేసాడు. చాలా నిజాయితీగా పనిచేసాడు. ఎక్కడ ఎలా ఉండాలి, సినిమా మొత్తం నేనే కనిపించాలి అన్న ఇంటెన్షన్ లేకుండా  ముఖ్యంగా కొత్త దర్శకుడు అన్న టెన్షన్ ఎక్కడా లేకుండా చేసాడు. తప్పకుండా దర్శకుడిగా, నటుడిగా మోహన్ కు మంచి పేరొస్తుంది.

ప్ర: ఎక్కువగా వర్మ తో సినిమాలు చేసారు ?

జ : నా గాడ్ ఫాదర్ వర్మ గారే. కరోనా సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు వర్మ ఫోన్ చేసి శ్రీకాంత్ ఇప్పుడు ఖాళీగా ఉన్నావా అని అడిగితె అవును సర్ అన్నాను. సరే అని అయన రెండు సినిమాల్లో నటింప చేసాడు.

ప్ర : ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు ?

జ : ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే నలభై ఐదు సినిమాలు ఉన్నాయి. అలాగే కన్నడలో రెండు సినిమాలు చేశాను. వెబ్ సిరీస్ లు కూడా చేశాను. ఏ అవకాశం వచ్చినా వదిలేదు లేదు.

ప్ర : ఈ సినిమాలో డైలాగ్ విషయంలో ఎక్కువగా వినిపిస్తుంది ?

జ : డైలాగ్స్ చాలా బాగున్నాయి. రచన శైలి అంటారు కదా.. అలా చాలా అద్భుతంగా ఉంటాయి. పాత్ర పరంగా ఉంటాయి , ఎదో పంచ్ డైలాగ్ వెయ్యాలి అన్న ఆలోచనతో కాదు నాచురల్ గా డైలాగ్స్ ఉంటాయి. దాంట్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది.

ప్ర : హీరో నవీన్ చంద్ర గురించి ?

జ : నవీన్ చంద్ర తో ఒకరోజు పనిచేసాను. అయన పాత్ర చాలా బాగుంటుంది. నవీన్ చంద్ర మంచి ఆర్టిస్ట్, ఆయనే కాదు చాలా మంది మంచి నటీనటులు నటించారు.

ప్ర : ఫైనల్ గా 1997 సినిమా సమస్యలను చూపించే ప్రయత్నం చేసారా ? లేక దానికి సొల్యూషన్ చెప్పారా ?

జ : ఈ రోజుల్లో మారమంటే ఎవరు మారతారు చెప్పండి. ఒక సినిమా విడుదలైతే ప్రతి ఒక్కరు సినిమా ఇలా ఉంది, కెమెరా ఇలా ఉంది, ఫ్రేమ్ ఇలా ఉందంటూ విమర్శిస్తుంటారు .. కానీ వాళ్లకు ఇందులో ఏవి తెలియదు, కెమెరా గురించి అసలు తెలియదు, డైరెక్షన్ రాదు కానీ అన్ని తెలుసన్నట్టుగా మాట్లాడేస్తుంటారు. అలాగే ఈ సినిమాలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యల గురించి చెప్పే ప్రయత్నం చేసారు.

ప్ర : తదుపరి చిత్రాలు ?

జ : ప్రస్తుతం చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నటుడిగా నేను మూడు పాత్రలు మాత్రం చేయను.. ఆ పాత్రలు తప్ప మిగతా పాత్రలు చేస్తా. ఆ పాత్రలేవంటే .. చైల్డ్ ఆర్టిస్ట్ , హీరోయిన్ , హీరో ఈ మూడు పాత్రలు తప్ప అన్ని రకాల పాత్రలు చేస్తా !