టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల సత్య నారాయణ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. ” సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. జ్వరంతో ఈరోజు ఉదయం 7.30 నిమిషాలకు అపోలోలో చేరారు. కోవిడ్ తర్వాత సత్యనారాయణ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన చికిత్సకు ఆశించినంత మేర స్పందించడం లేదు.. అని వైద్యులు తెలిపారు.