దివంగత ఎన్టీఆర్‌ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నాడని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు.
చంద్రబాబు యథావిధిగా కుటుంబానికి అబద్ధం చెప్పాడని విమర్శించారు. అసెంబ్లీలో ఏమీ జరగకున్నా, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని మండిపడ్డారు.
కన్నీళ్లు పెట్టుకొని పెద్ద సీన్ క్రియేట్ చేశారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.
ఆ మహానీయుడి కుటుంబంలో పుట్టి ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. మీ నాన్నగారి విషయంలో చంద్రబాబు ఒక్క నిజం కూడా చెప్పలేదని, ఎన్టీఆర్ ఎపిసోడ్‌లోనూ భువనేశ్వరి, పురందేశ్వరి బాలకృష్ణ మనసు మార్చారని పేర్కొన్నారు.
చంద్రబాబు గురించి ఎన్టీఆరే స్వయంగా చెప్పారు కదా.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు