*రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్ , అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని నటీనటులుగా సుహాస్ మీరా దర్శకత్వంలో రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరిలు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “ఐరావతం”.ఈ ఐరావతం ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా*
*దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ..* ఫస్ట్ అఫ్ ఆల్ థాంక్స్ టూ మై ప్రొడ్యూసర్స్ ఈ కథ విని నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక వర్గానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
*నిర్మాతలు మాట్లాడుతూ :* ఈ చిత్రాన్ని కథ లోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అర్థమైంది. ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అని తెలియ జేస్తున్నాము. మా ఈ ఫస్ట్ లుక్ కి ఇంతటి ఆదరణ తీసుకొచ్చిన పి ఆర్ ఓ మధు గారికి మరియు ఆయన టీం కి ధన్యవాదాలు .
*నటీనటులు* అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్, అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని తదితరులు
*సాంకేతిక నిపుణులు* సమర్పణ : రేఖ పలగానిబ్యానర్ : నూజివీడు టాకీస్ నిర్మాతలు : రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరిలు తదితరులురచన-దర్శకత్వం సుహాస్ మీరా.ఎడిటర్ సురేష్ దుర్గం, సినిమాటోగ్రఫీ ఆర్ కె వల్లపు ,సంగీతం సత్యా కశ్యప్, పి.ఆర్.ఓ : మధు వి.ఆర్