NTR వ్యాఖ్యాతగా .. జెమిని టివి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” లో  కోటి రూపాయలు గెలుచుకున్న తొలి విజేతగా కొత్తగూడెంకు చెందిన బి. రాజా రవీంద్ర నిలిచారు, ఇంత పెద్ద మొత్తం ఇప్పటిదాకా ఏ తెలుగు ఛానల్ లోనూ ఏ కంటెస్టెంట్ కానీ, ఏ సెలబ్రిటీ గాని గెలుచుకోలేదు.    మొట్టమొదటిగా విజేత రాజా రవీంద్రకు కోటి రూపాయలు అందించిన ఘనత జెమిని టివికి మాత్రమే దక్కుతుంది. 
 జెమిని టీవీలో ప్రసారమవుతున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షో, విజ్ఞానం, వినోదంతో NO.1 గేమ్ షోగా  ఇంటిల్లిపాదిని అలరిస్తోంది. ఇప్పటిదాకా ఈ షోలో  కంటెస్టెంట్స్.. హాట్ సీట్లో కూర్చొని  వారి అనుభవాల్ని, వారి లక్ష్యాలను NTRతో పంచుకుంటూ…  ఉత్కంఠభరితంగా ఆడుతూ ఎన్టీఆర్ వేసిన ప్రశ్నలు ఒక్కొక్కటి దాటుకుంటూ లక్షల కొద్ది రూపాయాలు గెలుచుకోన్నారు,అయితే ఈ షోలో  అత్యధిక నగదు కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కంటెస్టెంట్ గా సరికొత్త రికార్డును సృష్టించారు 33 ఏళ్ళ బి రాజా రవీంద్ర, ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం, వృత్తిరీత్యా  ఆయన POLICE  శాఖలో  సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు,  రాజా రవీంద్ర క్రీడా రంగంలో కూడా దిట్ట, గన్ షూటింగ్ లో జాతీయ అంతర్జాతీయ పోలీస్ క్రీడా పోటీలలో పాల్గొని ఎన్నో పథకాలను సాధించారు.  ఎప్పటికైనా ఒలింపిక్స్ లోపాల్గొని ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో మెడల్ సాధించాలని రాజా రవీంద్ర లక్ష్యం, అది నెరవేరడం కోసం గెలుచుకున్న కోటి రూపాయల నగదు ఉపయోగిస్తానని అయన తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.  “ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో వ్యాఖ్యాత ఎన్టీఆర్ చెప్పినట్లుగా “ఆట నాది కోటి మీది” కొటేషన్ అక్షర సత్యం చేస్తూ కంటెస్టెంట్ బి. రాజా రవీంద్ర తన కలను నిజం చేసుకొని ” తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరి కొత్త రికార్డ్ సృష్టించారు,మరి ఈ  మహా ఎపిసోడ్ లో NTR, కంటెస్టెంట్ రాజా రవీంద్రను ఏ ప్రశ్నలు వేసారు, కోటి రూపాయల ప్రశ్న దాకా ఎంత ఉత్కంఠభరితంగా ఆట కొనసాగింది తెలియాలంటే జెమిని టివిలో సోమ, మంగళవారాల్లో రాత్రి 8.30 ని.లకు ప్రసార మయ్యే”ఎవరు మీలో కోటీశ్వరులు” కోటి రూపాయల అద్భుత ఎపిసోడ్ ను తప్పక చూడండి.