మ్యూజిక్ కి స్కోపున్న సినిమా ఛ‌లో ప్రేమిద్దాంః సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో

బ్లాక్ అండ్ వైట్‌, ప్రియుడు సినిమాల‌తో టాలీవుడ్ లోకి నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చిన ఉద‌య్ కిరణ్ తాజాగా హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ పతాకంపై తాజాగా  నిర్మించిన చిత్రం ఛ‌లో ప్రేమిద్దాం.  ప్రెజ‌ర్ కుక్క‌ర్‌ ఫేమ్  సాయి రోన‌క్‌,  90 ఎమ్ ఎల్  ఫేమ్ నేహ సోలంకి జంట‌గా న‌టించారు. సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. నువ్వానేనా, జోరు,  బెంగాల్ టైగ‌ర్‌, ఏంజెల్, న‌క్ష‌త్రం,  పేప‌ర్ బాయ్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన  యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ చేశారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఉద‌య్ కిర‌ణ్‌, సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో మీడియాతో మాట్లాడారు…ఆ విశేషాలు వారి మాట‌ల్లో…

 చిత్ర  నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ….
 మీ గ‌త చిత్రాల గురించి చెప్పండి?
 నేను గ‌తంలో రాజీవ్ క‌న‌కాల‌తో బ్లాక్ అండ్ వైట్, వ‌రుణ్ సందేశ్ హీరోగా ప్రియుడు చిత్రాలు నిర్మించాను. ప్రియుడు సినిమా  స‌మ‌యంలో సురేష్  ప‌రిచ‌యం. ఆ స‌మ‌యంలోనే  త‌ను ఒక మంచి క‌థ చెప్పాడు . ఆ క‌థ న‌చ్చి  ఛ‌లో ప్రేమిద్దాం చిత్రం నిర్మించాను.  సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఇటీవ‌ల షో వేసుకుని చూశాం. టీమ్ అంతా సినిమా పై ఎంతో న‌మ్మ‌కంతో ఉన్నాం.
ఛ‌లో ప్రేమిద్దాం క‌థాంశం గురించి చెప్పండి?
ప్ర‌జంట్ ట్రెండ్ కు క‌నెక్టయ్యే అంశాల‌తో పాటు  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా ఇది. ఇందులో మంచి ల‌వ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ పాయింట్  ఉంది.  ద‌ర్శ‌కుడు సినిమాను చాలా బాగా డీల్ చేశారు. ఖ‌ర్చుకు ఎక్క‌డా వెన‌కాడ కుండా చాలా రిచ్ గా తీశాం. భీమ్స్   అద్భుత‌మైన పాట‌లు ఇవ్వ‌డంతో దుబాయ్ లో మూడు పాట‌లు చిత్రీక‌రించాం. హీరో హీరోయిన్స్ తో పాటు టెక్నీషియ‌న్స్ అంతా కూడా ప్ర‌తిభావంతులు మా సినిమాకు ప‌ని చేశారు. అంద‌రికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.
 ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు?
ఈ నెల 19 న దాదాపు 200ల థియేట‌ర్స్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇక‌పై మా బేన‌ర్ లో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.

 
 సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ….

 ఛ‌లో ప్రేమిద్దాం పాట‌ల గురించి చెప్పండి?
ఈ చిత్రంలో పంచ భూతాల్లాంటి ఐదు  పాట‌లున్నాయి. ఎమ్‌బిఏ ఎమ్ సిఏ అనే కాలేజ్ పెప్పీ సాంగ్ ఇటీవ‌ల ఆదిత్య ఆడియో ద్వారా మార్కెట్ లోకి విడుద‌లైంది. ఆ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు రిలీజ్ చేస్తాం. భీమ్స్ అంటే ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ మాస్ సాంగ్స్ అనుకునే వారు. కానీ, ఈ సినిమాతో భీమ్స్ మాస్ తో పాటు, మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా చేయ‌గ‌ల‌డ‌ని ప్రూవ్ చేసే విధంగా పాట‌లుంటాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోరు భీమ్స్ చేయ‌గ‌ల‌డా? అని అనుకునే వారికి ఈ సినిమా మంచిస మాధానం చెబుతుంది. పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న‌ప్పుడే సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఏర్పడింది. క‌చ్చితంగా ఛ‌లో ప్రేమిద్దాం చిత్రం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది.
 ద‌ర్శ‌క నిర్మాత‌ల గురించి చెప్పండి.
 డైర‌క్ట‌ర్ సురేష్ గారు సీనియ‌ర్ డైర‌క్ట‌ర్ జ‌యంత్ సి. ప‌రాన్జీ గారి వ‌ద్ద ద‌ర్శ‌కత్వ శాఖ‌లో ప‌ని చేశారు.  క్లారిటీ, క్రియేటివిటీ  ఉన్న డైర‌క్ట‌ర్ సురేష్ గారు.  నుంచి మంచి మెలోడీస్ తీసుకున్నారు. ఆర్‌.ఆర్ చేస్తూ సినిమా చాలా ఎంజాయ్ చేశాను.   ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా  చిత్రాల త‌ర‌హాలో   ఈ సినిమా కూడా    ప్ర‌తి ఫేమ్ అంత‌ అందంగా, ఆక‌ట్టుకే విధంగా, ఆహ్లాద‌ర‌కరంగా  ఉంటుంది. ఎక్క‌డా అడ‌ల్ట్ కంటెంట్ కానీ డ‌బుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా సినిమా పిల్ల‌లు, పెద్ద‌లు, యూత్‌ అంద‌రూ చూసే విధంగా క్లీన్ గా ఉంటుంది. ఇక‌ మా నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ గారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా చాలా రిచ్ గా నిర్మించారు. అలాగే హీరో హీరోయిన్ జంట  స్క్రీన్ పై క‌నుల‌పండుగ‌గా ఉంటుంది. న‌న్ను న‌మ్మి ఈ చిత్రానికి  మ్యూజిక్ చేసే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పత్రికాముఖంగా  ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నా.
ఈ చిత్రంలో మీకు ప‌ర్స‌న‌ల్ గా న‌చ్చిన పాట‌?
ఒక పాట‌ని కాదు నాకు ప్ర‌తి పాట న‌చ్చింది. కాలేజ్ కుర్రాళ్ల‌కు ఎమ్ బిఏ ఎమ్‌సిఏ, యూత్ కి పిల్లా నీవ‌ల్ల‌, ల‌వ‌ర్స్ కి హే జింద‌గీ, జింద‌గీ పాట న‌చ్చుతుంది.  అన్ని ర‌కాల పాట‌లు ఈ చిత్రంలో చేశాం. బాలీవుడ్ సింగ‌ర్స్ తో పాడించాం. దేవ్ ప‌వార్ ని ఈ చిత్రం ద్వారా లిరిసిస్ట్ గా ప‌రిచ‌యం చేస్తున్నాం. ఇక నా ప్ర‌తి సినిమాలో సురేష్ గంగుల పాట‌లు రాస్తాడు. ఈసినిమాలో కూడా మూడు పాట‌లు రాశాడు.  మంచి రైట‌ర్స్, మంచి సింగ‌ర్స్ ఈ సినిమాకు ప‌ని చేశారు. సినిమాలు విన‌డానికి ఎంత బాగా ఉంటాయో, చూడ‌టానికి కూడా అంత అందంగా చిత్రీక‌రించారు.  మ్యూజిక్ డైర‌క్ట‌ర్ గా పూర్తి సంతృప్తినిచ్చిన చిత్ర‌మిది. ఈ నెల 19న వ‌స్తోంది. సినిమాను పెద్ద స‌క్సెస్  చేస్తార‌ని కోరుకుంటున్నా.
మీ త‌దుప‌రి చిత్రాల వివ‌రాలు?
ప్ర‌స్తుతం ర‌వితేజ గారు హీరోగా రూపొందుతోన్న ధ‌మాకా చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నా. వాటితో పాటు మ‌రికొన్ని చిత్రాలక మ్యూజిక్ చేస్తున్నా. ఈనెల 19న నేను మ్యూజిక్ చేసిన ఛ‌లో ప్రేమిద్దాంతో పాటు  ఊరికి ఉత్త‌రానా, రామ్ అసుర, చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

 

 

 `