తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. గ్లోబెల్ రేంజ్‌లో ప్ర‌తీసారి ఆహా వీక్ష‌కుల కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా దూసుకెళ్తోంది. ఈ ఏడాది దీపావళికి ఆ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను రెట్టింపు చేసేలా హ్యాపీనెస్‌ను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఆహా యాప్‌ను 2.0గా అప్‌గ్రేడ్ చేసి స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో వీక్ష‌కుల‌కు అందిస్తూ సంబ‌రాల‌ను తీసుకొచ్చింది ఆహా. ఇప్పుడు మ‌న తెలుగువారి ఓటీటీలో సంద‌డి చేయ‌డానికి న‌వంబ‌ర్ 12న వ‌స్తున్న మ‌రో వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్‌’. తెలుగు ఎంట‌ర్‌టైన్మెంట్‌లో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు హీరోయిన్స్ పాయ‌ల్ రాజ్‌పుత్‌, పూర్ణ‌, ఈషా రెబ్బాల‌తో ఆహా రూపొందించిన ‘త్రీ రోజెస్‌’ వెబ్ సిరీస్‌కు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి షో ర‌న్న‌ర్‌. ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేసి న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. 
యాక్ష‌న్ క‌ట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై పాయ‌ల్ రాజ్‌పుత్‌, పూర్ణ‌, ఈషా రెబ్బా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా మ్యాగీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్‌’. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ సిరీస్‌కు షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ ఒరిజిన‌ల్ న‌వంబ‌ర్ 12 నుంచి  ‘ఆహా’లో ప్ర‌సార‌మ‌వుతుంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ….
డైరెక్ట‌ర్ మ్యాగీ మాట్లాడుతూ ‘‘మారుతిగారికి, ఎస్‌కెఎన్‌గారికి థాంక్స్‌. అలాగే పూర్ణ‌, పాయ‌ల్‌, ఈషాల‌కు కూడా థాంక్స్‌. నా టీమ్ ఎంతో స‌పోర్ట్ చేశారు. అంద‌రి క‌ష్ట‌మే త్రీ రోజెస్ వెబ్ సిరీస్‌. అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ బ‌డ్జెట్ పెట్టించాను. కానీ నిర్మాత ఎస్‌కెఎన్‌గారు ప‌రిస్థితి అర్థం చేసుకుని స‌పోర్ట్ చేశారు. ఇలా ఈ జ‌ర్నీలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు. 
నిర్మాత ఎస్‌కెఎన్ మాట్లాడుతూ ‘‘గత వారం మారుతిగారి దర్శకత్వంలో నేను నిర్మించిన మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదలై మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. ఇప్పుడు త్రీరోజెస్ అనే వెబ్ సిరీస్ రానుంది. దీనికి కూడా మారుతిగారే షో ర‌న్న‌ర్‌. నేను ఎన్ని చేసినా నా వెనుక మారుతిగారు ఉన్నార‌నే ధైర్యం ఎప్పుడూ ఉంటుంది. నాకు ఆయ‌న మంచి స్నేహితుడు. ఈ రెండేళ్ల‌లో నేను ఆరు సినిమాల‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఓ రోజు అర‌వింద్‌గారు పిలిచి, ఆహా కోసం ఓ షో చేయ‌మ‌ని చెప్పారు. మారుతిగారు పెద్ద డైరెక్ట‌ర్‌, పెద్ద సినిమాలు చేస్తున్నారు. అయినా ఆయ‌న న‌న్ను పిలిచి ఓ వెబ్ సిరీస్ చేద్దామ‌ని అన్నారు. ఆయ‌న ర‌వికి పాయింట్ చెప్పి క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌మ‌న్నారు. క‌థ డెవ‌ల‌ప్ అయిన త‌ర్వాత ర‌విని డైరెక్ట్ చేయ‌మ‌న్నా చేయ‌కుండా మ్యాగీ పేరుని స‌జెస్ట్ చేశాడు. బాల్‌రెడ్డిగారు.. మ‌ధ్య‌లో ఎన్ని ఆఫ‌ర్స్ వ‌చ్చినా వ‌దిలిపోకుండా ఈ సిరీస్ కోసం క‌మిట్‌మెంట్‌తో ప‌నిచేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో యూనిట్‌లో ప‌ద‌మూడు మందికి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చినా..ట్రీట్‌మెంట్ తీసుకుని ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా షోను పూర్తి చేశాం. స‌న్నీ ఎం.ఆర్ త‌న‌దైన స్టైల్లో అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఈ సిరీస్‌లో 7-8 పాటలున్నాయి. ఇలా యూనిట్ అంద‌రూ మంచి వెబ్ సిరీస్‌ను అందించాల‌ని త‌ప‌న‌తో వ‌ర్క్ చేశారు. అలాగే రాశీఖ‌న్నాగారు మా టీమ్‌ను స‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఆమెకు ధ‌న్య‌వాదాలు. పాయిల్ రాజ్‌పుత్‌, ఈషారెబ్బా, పూర్ణ ముగ్గురు బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మేం అడిగామ‌ని, న‌చ్చి చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. వారి వ‌ల్లే ఈ సిరీస్‌కు ఓ లుక్ వ‌చ్చింది. త్రీరోజెస్‌లో ఈ వారం నాలుగు ఎపిసోడ్స్‌ను విడుద‌ల చేస్తున్నాం. మ‌రో నాలుగు ఎపిసోడ్స్‌ను వ‌చ్చే వారం విడుద‌ల చేయ‌బోతున్నాం. దీన్ని సిరీస్ అన‌డం కంటే నాలుగు గంట‌ల సినిమాగా ఆహా వాళ్లు అందిస్తున్నారు’’ అన్నారు. 
ఈషా రెబ్బా మాట్లాడుతూ ‘‘మా త్రీరోజెస్ టీజర్, ట్రైలర్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోష‌మేసింది. ఈ సిరీస్‌లో నన్ను భాగం చేసిన మారుతిగారికి థాంక్స్‌. అలాగే ఆహా నిర్వాహ‌కుల‌కు కూడా ధ‌న్య‌వాదాలు. నిర్మాత ఎస్‌కెఎన్‌, డైరెక్ట‌ర్ మ్యాగీ చాలా మంచి వ్య‌క్తులు. వారితో జ‌ర్నీని ఎంజాయ్ చేశాను. అలాగే పాయల్ రాజ్‌పుత్‌, పూర్ణ ఫ్రెండ్స్‌లా క‌లిసి ఫ‌న్‌తో వ‌ర్క్ చేయ‌డం మ‌ర‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌. ముగ్గురు హెల్దీ కాంపీటీష‌న్‌తో వ‌ర్క్ చేశాం’’ అన్నారు. 
పూర్ణ మాట్లాడుతూ ‘‘ ఈ సిరీస్‌లో భాగం చేసిన ఎస్‌కెఎన్‌గారికి థాంక్స్‌. సాధార‌ణంగా నా పేరు చెబితే ఎక్కువ‌గా కాస్ట్యూమ్స్ చూస్తే నేను ఎక్కువ‌గా చీర‌లోనే క‌న‌ప‌డి ఉంటాను. కానీ ఈ సిరీస్‌లో నా స్టైల్ పూర్తిగా మారింది. మ్యాగీ ప్రామిసింగ్ డైరెక్ట‌ర్‌. త‌ను భ‌విష్య‌త్తులో పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు. సినిమాటోగ్రాఫ‌ర్ బాల్ రెడ్డిగారితో నేను రెండ‌సారి క‌లిసి ప‌నిచేశాను. ఆయ‌న విజువ‌ల్స్‌తో మాయ చేస్తారు. ప్ర‌తి సీన్‌ను అందంగా చూపిస్తారు. తెలుగులో నేను యాక్ట్ చేసిన ఫ‌స్ట్ సిరీస్ ఇది. పాయ‌ల్‌, ఈషా రెబ్బాతో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం గుడ్ ఎక్స్‌పీరియెన్స్‌. ఈ సిరీస్‌ను సీజ‌న్ 2 కూడా చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 
పాయ‌ల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ ‘‘త్రీరోజెస్ వెబ్ సిరీస్ గురించి చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉంది. ఆహాతో క‌లిసి రెండోసారి వ‌ర్క్ చేశాను. నేటి త‌రానికి చెందిన ముగ్గురు అమ్మాయిల జీవితంలో ఎలాంటి విష‌యాలు జ‌రిగాయ‌నే దాన్ని ఈ సిరీస్‌లో చూడబోతున్నారు. నేను మారుతిగారితో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని చాలా రోజులుగా అనుకుంటుంటే త్రీరోజెస్‌లో ఆ అవ‌కాశం ద‌క్కింది. రవిగారి డైలాగులు బాగా వైర‌ల్ అయ్యాయి. మ్యాగీగారు ప్ర‌తి పాత్ర‌ను చ‌క్క‌గా ప్రెజెంట్ చేయ‌గా, బాల్ రెడ్డిగారు ప్ర‌తి సన్నివేశాన్ని అందంగా చూపించారు. ఈ జ‌ర్నీలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 
డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ‘‘ఓరోజు అర‌వింద్‌గారు పిలిచి ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేయాల‌న్నారు. అప్పుడు అమ్మాయిల అభిప్రాయాలు, ఎమోష‌న్స్‌పై ఓ సిరీస్ చేయ‌వ‌చ్చు క‌దా అని మా స్టైలిష్ శ్వేతా చెప్పింది. అది న‌చ్చింది. సాధార‌ణంగా అమ్మాయిల‌కు పెళ్లి చూపులు విష‌యంలో చాలా స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వారి ఎదుగుద‌ల‌కు పెళ్లి అనేది అడ్డంకిగా మారింది. అనే పాయింట్ ఎలా ఉంటుంద‌నే పాయింట్‌ వేర్వేరు ఆలోచ‌న‌లున్న‌ ముగ్గురు అమ్మాయిల‌కు ఎలా ఉంటుంద‌ని ఆలోచించి పాయింట్‌ను అర‌వింద్‌గారికి చెప్పాను. ఆయ‌న‌కు బాగా న‌చ్చ‌డంతో చేసేద్దాం అన్నారు. అప్పుడు ర‌విని పిలిచి క‌థ డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని అన్నాను. అక్క‌డి నుంచి ట్రావెల్ ప్రారంభ‌మైంది. ర‌వి, మ్యాగీ, ఎస్‌కెఎన్ ముగ్గురు ఎంతో క‌ష్ట‌ప‌డి అద్భుత‌మైన ప్రొడక్ట్‌ను అందించారు. పాయ‌ల్ రాజ్‌పుత్‌, ఈషారెబ్బా, పూర్ణ క‌థ విన‌గానే ఎగ్జ‌యిట్ అయ్యి.. ఈ ప్రాజెక్ట్‌లో వ‌ర్క్ చేశారు. త‌ప్ప‌కుండా ఈ వారం విడుద‌లయ్యే నాలుగు ఎపిసోడ్స్ మెప్పిస్తాయి. నెక్ట్స్ వారం మ‌రో నాలుగు ఎపిసోడ్స్ విడుద‌ల చేస్తాం. అమ్మాయిల ఫీలింగ్స్‌, ఎమోష‌న్స్‌కు వేల్యూ ఇవ్వాల‌ని చెప్పే సిరీస్ ఇది. ప్ర‌తి అమ్మాయి చూడాల్సిన సిరీస్‌’’ అన్నారు. 
రాశీఖ‌న్నా మాట్లాడుతూ ‘‘త్రీ రోజెస్ ట్రైలర్ బావుంది. తెలుగులో ఇలాంటి కంటెంట్ చూడలేదు. ఇలాంటి కాన్సెప్ట్‌ను అందిస్తున్న ఆహాకు థాంక్స్‌. అర‌వింద్‌గారిని నేను ప్రారంభం నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ ఆయ‌న కొత్త టాలెంట్‌ను, కాన్సెప్ట్‌ను ఎంక‌రేజ్ చేస్తుంటారు. ముగ్గురు అమ్మాయిలు పాయ‌ల్ రాజ్‌పుత్‌, పూర్ణ‌, ఈషారెబ్బా న‌టించిన త్రీరోజెస్‌.. ముగ్గురు అమ్మాయిల ఎమోష‌న్స్ గురించి చెబుతుంది. అమ్మాయిలు పెళ్లి, కెరీర్ గురించి దాదాపు అంద‌రూ అమ్మాయిలు ఇబ్బందులు ప‌డుతుంటారు. దాని గురించి ఈ కాన్సెప్ట్‌లో సిరీస్ రావ‌డం చాలా గొప్ప విష‌యం. డైరెక్టర్ మ్యాగీ, నిర్మాత ఎస్‌.కె.ఎన్‌గారు స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 
ఈ కార్యక్రమంలో ఆహా ప్ర‌తినిధి, క‌థా ర‌చ‌యిత ర‌వి, పాటల ర‌చ‌యిత రాంబాబు గోశాల తదిరతులు పాల్గొన్నారు.