అనంతపురం: పోలీస్ సేవా పతకానికి ఎంపికైన సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహనరావును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఈరోజు సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పతకాలకు ఎంపిక చేస్తూ జాబితా వెల్లడించింది. ఇందులో సెబ్ అదనపు ఎస్పీ కూడా ఎంపిక కావడంతో జిల్లా ఎస్పీ తన ఛేంబర్లో ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. మెమొంటో అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో నోడల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కుమరేశ్వరన్, ఎక్సైజ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు, సెబ్ ఇంటెలిజెన్స్ సి.ఐ నరసానాయుడులు పాల్గొన్నారు.
** జిల్లా పోలీసు కార్యాలయం, అనంతపురం **