జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా  మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లు గా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో  తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాస రావులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “వేయి శుభములు కలుగు నీకు”.ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమాలోని ఫాదర్ & సన్ ల మధ్య సాగే సెంటిమెంట్ సాంగ్ “వేల స్వర్గాలు” పాటను యాక్షన్ హీరో విశాల్ గారు విడుదల చేశారు.ఈ సందర్భంగా..

యాక్షన్ హీరో విశాల్ మాట్లాడుతూ .. ఒక సినిమాకు టైటిలే చాలా ముఖ్యం. దాంట్లో పాజిటివ్ టైటిలే పెట్టేది ఇంకా ముఖ్యం.ఈ సినిమాకు పెట్టిన ‘వేయి శుభములు కలుగు నీకు” టైటిల్ అంటే థౌజండ్ బ్లెస్సింగ్స్ ప్రతి తల్లి తండ్రి కొడుకుకు, కూతురుకు చెప్పే విషయం ఏ మంచి పని చేయలనుకున్నా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పే మంచి విషయం ఈ సినిమా తో తమ్ముడు విజయ్ రాజా ఇంట్రడ్యూజ్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన తండ్రి శివాజీ రాజా చాలా మంచి మనిషి తను నా ఎల్డర్ బ్రదర్ లాంటి వారు. అలాంటిది ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న వారి  అబ్బాయి విజయ్ రాజాకి అల్ ధ బెస్ట్. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధం చూపెట్ట కుండా కంటెంట్ ఉన్న సినిమాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తారు.ఈ సినిమాలోని ఫాదర్ & సన్ మధ్య సాంగ్ ఇప్పుడే చూశాను ఇలాంటి పాట అన్ని సినిమాలలో రాదు. ఫాదర్ & సన్  ల సెంటిమెంట్ అనేది ప్రతి కుటుంబం లో ఉంటుంది.కాబట్టి ఈ సినిమా ప్రతి ఫ్యామిలీ కి కనెక్ట్ అవుతుంది. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దర్శకుడు రామ్స్ రాథోడ్ కు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను నిర్మిస్తున్న తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు లకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

చిత్ర దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ .. జయదుర్గ దేవి మల్టీ మీడియా, జామి లక్ష్మీ ప్రసన్న లు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. ఇందులో అద్బుతమైన సెంటిమెంట్ ఉంటుంది. ఫాదర్ & సన్  ల మీద సాగె సాంగ్ ను చూసి హీరో విశాల్ గారు మెచ్చు కున్నందుకు చాలా సంతోషంగా ఉంది.తను గ్రేట్ యాక్టరే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తి విశాల్ గారు.అలాగే పునీత్ రాజ్ కుమార్ గారు ఈ రోజు మనమధ్య లేకపోవడం చాలా భదాకరం. పునీత్ రాజ్ కుమార్  గారు చదివించే 1800 మంది పిల్లల బాధ్యతను తను తీసుకొని చదివిస్తానని చెప్పడం చాలా గొప్ప విషయం.ఈ రోజు మా సినిమా లోని ఈ సాంగ్ ను లాంచ్ చేసిన విశాల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన కథను నన్ను నమ్మిన చిత్ర నిర్మాతలు  తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు లు ఖర్చుకు వెనుకాడకుండా బడ్జెట్ కు కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ నాకు ఫుల్ ఫ్రీడమ్ నిచ్చి నాతో మంచి ఔట్ ఫుట్ ను రాబట్టుకున్నారు.ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. పండుగ వాతావరణంలో వస్తున్న మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది.. హీరో,హీరోయిన్స్ చాలా చక్కటి నటనతో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నీషియన్స్, అరిస్టు లు అందరూ సహరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది.చూసిన ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

చిత్ర హీరో విజయ్ రాజా మాట్లాడుతూ ..ఈ రోజు విశాల్ గారు ఎంతో బిజీ గా ఉన్న మా సినిమాకు టైం ఇచ్చి మా
‘వేయి శుభములు కలుగు నీకు” చిత్రం టైటిల్ సాంగ్ ను  లాంచ్ చేసినందుకు ఇది మా అదృష్టంగా ఫీల్ అవుతూ వారికి మా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాము.మా చిత్ర దర్శకుడు చాలా కష్టపడి మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశాడు.ఇంతమంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

చిత్ర నిర్మాతలు తూము నరసింహ పటేల్,  జామి శ్రీనివాసరావు మాట్లాడుతూ .. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా “వేయి శుభములు కలుగు నీకు” చిత్రం నుండి నాలుగవ పాటను విడుదల చేయడం జరిగింది. విశాల్ గారు ఎనిమీ సినిమా ప్రమోషన్ లో ఎంతో బిజీ గా ఉన్నా కూడా మా చిత్రం లోని సాంగ్ ను విడుదల చేసినందుకు ధన్య వాదాలు తెలుపు కుంటున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.

నటి నటులు
విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, ఢీ ఫేం ఫాల్గుణి,  సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, షాయాజి షిండే,  శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్  అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు.

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా
టైటిల్ : “వేయి శుభములు కలుగు నీకు”
నిర్మాత : తూము నరసింహ పటేల్,  జామి శ్రీనివాసరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్
కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి
కెమెరా : కె బుజ్జి
సంగీతం : గ్యాని
ఆర్ట్ డైరెక్టర్ : బి జగన్
కో డైరెక్టర్ : ప్రకాష్
కాస్ట్యూమ్ : ఎల్ . కిశోరె కుమార్
ఎడిటర్ :వినోద్
పి.ఆర్.ఓ : హర్ష