సోను సూద్ చేతులమీదుగా “బెస్ట్ పేజెంట్స్ డైరెక్టర్ అఫ్ ది ఇయర్ అవార్డ్” అందుకున్న మనోజ్ వీరగొని…
గోవా లో జరిగిన ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డ్స్ 2021 కార్యక్రమంలో మన హైదరాబాద్ కి చెందిన “వింగ్స్ మోడెల్ హబ్ హైదరాబాద్” డైరెక్టర్ Mr.మనోజ్ వీరగొని బెస్ట్ పేజెంట్స్ డైరెక్టర్ అఫ్ ది ఇయర్ అవార్డ్ శ్రీ.సోను సూద్ గారి చేతుల మీదుగా అందుకున్నారు..
హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వింగ్స్ మోడల్ హబ్ డైరెక్టర్ Mr. మనోజ్ వీరగొని మాట్లాడుతూ, “ఇటీవల మేము నిర్వహించిన, మన హైదరాబాద్ లోనే అత్యుత్తమైన ఫాషన్ పెజెంట్ 2021 వింగ్స్ మిస్టర్ & మిస్ హైదరాబాద్ 2021 గాను మాకు ఈ గుర్తింపు దొరకటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవార్డు రియల్ హీరో సోను సూద్ సర్ చేతుల మీదుగా తీసుకోవటం మరింత ప్రత్యేకమైనదిగ భావిస్తున్నాం.. మా సంస్థ, వింగ్స్ మోడెల్ హబ్ కి గత నెలలో మన దేశం లో మునుమెన్నడు లేని విధంగా 260 మోడల్స్ తో ఒకేసారి ఆడిషన్ నిర్వహించనదుకు గాను బెస్ట్ మోడలింగ్ ఏజెన్సీ అవార్డ్ కూడా బెంగళూరులో వచ్చింది..
వ్యక్తిగతంగా నా గత విజయాలు – మిస్టర్ తెలంగాణ, మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ ఇండియా టాలెంటెడ్ సరసన బెస్ట్ పేజెంట్స్ డైరెక్టర్ అవార్డ్ చేరటం గర్వంగా వుంది.” అని అన్నారు