GST”మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
“తోలు బొమ్మల సిత్రాలు” బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం”GST”( గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఈ చిత్రం యొక్క టైటిల్ చాలా బాగుంది .డైరెక్టర్ గారు ఈ చిత్రం యొక్క కాన్సెప్ట్ చెప్పాకా,చాలా బాగా అనిపించింది.అలాగే ఈ సినిమా ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నారు.కాబట్టి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని,డైరెక్టర్ కొమారి జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని,చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. జూనియర్ సంపు మాట్లాడుతూ.. మాచిత్రం యొక్క ట్రైలర్ ని లాంచ్ చేసినందుకు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు.అలాగే సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని డైరెక్టర్ గారిని ఓటీటీలో రిలీజ్ చేయమని చాలా రిక్వెస్ట్ చేశాము. కానీ డైరెక్టర్ గారు ఈ సినిమా క్వాలిటీ గాని, కంటెంట్ గాని, సౌండ్ ఎఫెక్ట్స్ గాని బ్యాగ్రౌండ్ మ్యూజిక్…ఇలాయెన్నో, హంగులున్నటువంటి మనసినిమా థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ ఉంటుందని,ఇది థియోటర్స్ లోనే చూడాల్సిన సినిమా అని,థియేటర్లలోనే రిలీజ్ చేస్తానని ఇన్నాళ్లు థియోటర్స్ కోసం వెయిట్ చేశారు.ఖచ్చితంగా అతి త్వరలో ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. అలాగే జనరల్ గా ఈ కరోనా టైంలో…ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..ఫస్ట్ సినిమా థియేటర్స్ ని మూసి వేస్తున్నారు.తర్వాత లేటుగా సినిమా థియేటర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు కానీ… మిగతా ప్లేస్ లకన్నా..సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది థియేటర్స్ మాత్రమే. ఖచ్చితంగా మీరు థియేటర్ కి రండి.థియేటర్లోనే మా సినిమాని చూడండి.డోంట్ ఎంకరేజ్ పైరసీ. అలాగే మా డైరెక్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ డైరెక్టర్ అనడం కంటే బెస్ట్ రీసెర్చ్ కాలర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ సినిమా గురించి ఒక స్మశానం లో ఆయన చేసిన రీసెర్చ్ కానీ,అన్ని మతాల దేవాలయాలలో దేవుళ్ల గురించి ఆయన చేసిన రీసెర్చ్ గానీ,సైన్స్ గురించి ఆయన ఒక సైంటిస్టులా చేసిన రీసెర్చ్ గాని..ఈ మూడింటిని కలిపి అద్భుతమైన పాయింట్ ని తీసుకొని సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా ప్రివ్యూ చూశాక ఈ సినిమాలో నటించిన మేమే షాక్ అయ్యాము.ఎందుకంటే సినిమా అంత అద్భుతంగా వచ్చింది.ఈ సినిమాలో కామెడీ కూడా ఏదో అతికించినట్టుగా కాకుండా కథలో భాగంగా కామెడీ ఈ కథలో పండించిన విధానం చూస్తే ఐ యాం వెరీ బ్లెస్డ్. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందనీ,నాకు ఈ చిత్రం లో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా చిత్రాన్ని అతి త్వరలో థియేటర్లో చూసి అభినందించి, ఆశీర్వదిస్తారని కోరుతున్నానని చెప్పారు. స్వాతి మండల్ మాట్లాడుతూ..మా చిత్రం ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ట్రైలర్ ని చూశాకా మీకు చాలా ఇంట్రెస్ట్ కలిగి చాలా క్యూరాసిటీగా ఉంటారు.ఈ మూవీ లో ఏం చెప్పబోతున్నారని మీకు చాలా ఆత్రుత కలుగుతుంది.గాడ్ సైతాన్ టెక్నాలజీ పోస్టర్ ని చూస్తే.. మీరు హార్రర్ మూవీ అనుకుంటారు. కానీ..ఇందులో లవ్,కామెడీ, రొమాన్స్,హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు అన్నీ వుంటూ…ఫస్ట్ టైం కొత్త పాయింట్ తో మా చిత్రం రాబోతుంది. నేను హీరోయిన్ గా చేస్తూ,ఇంపార్టెంట్ పాత్రలో పోషించి,ఈ చిత్రంలో ఒక పార్ట్ అయినందున నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.ఈ ట్రైలర్ చూశాక మీకు ఖచ్చితంగా నచ్చి,చాలా ఎగ్జైట్ ఫీలై ఈ మూవీని థియోటర్స్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈచిత్రంలో నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మాట్లాడారు. అశోక్ మాట్లాడుతూ.. మా చిత్రం “GST”(గాడ్ సైతాన్ టెక్నాలజీ)చిత్రం యొక్క ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది.మా మూవీ” జిఎస్టి” జి అంటే గాడ్.అంటే దేవుళ్లకు సంబంధించి గానీ సైతాన్…దయ్యాల కు సంబంధించి గానీ,టెక్నాలజీ అంటే సైన్స్ లో ఒక కొత్త పాయింట్ ని తీసుకొని ఈ మూడింటిని కంపారిజన్ చేస్తూ..సృష్టిలో ఏది నిజం? దేవుడా, దయ్యమా, సైన్స్ వీటన్నిటిలో ఏది నిజం అని చెప్పాలని మా దర్శకులు శ్రీ కొమారి జానకిరామ్ గారు తనకున్న ఎక్స్పీరియన్స్ తో దాదాపు ఇండస్ట్రీలో మంచి దర్శకుల దగ్గర వర్క్ చేసి,ఎన్నో సంవత్సరాల అనుభవంతో ఒక కొత్త పాయింట్ ని తీసుకొని, ఒక మంచి ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్స్ తో సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలామందికి చాలా చాలా అపోహలున్నాయి.అసలు దేవుడు దెయ్యం సైన్స్ ఈ మూడింటిలో ఏది నిజం ? ఎవరు గొప్ప అనేది ? . నేను 100% ప్రామిస్ చేసి చెబుతున్నాను దానికి సమాధానం కావాలంటే మా మాత్రం”GST” సినిమాని చూడండి.100% యూ విల్ గెట్ ద క్లారిఫికేషన్ .మా మూవీ చాలా బాగుంది. ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చుతుంది.కామెడీ,రొమాన్స్ ,ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ తో మీ ముందుకు రాబోతున్నాం అని చెప్పారు. దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ.. మా “తోలు బొమ్మల సిత్రాలు”బ్యానర్ పై నిర్మించినటువంటి “గాడ్ సైతాన్ టెక్నాలజీ ” చిత్రం ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ముఖ్యంగా.. మంత్రిగారు టైటిల్ గురించి,మా చిత్రం గురించి,ఈ చిత్రం లో ఏ సందేశం ఇస్తున్నారని అడిగారు .మా సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నామో, ఏం సందేశం ఇస్తున్నామో చెప్పిన తర్వాత అది విని ,మంత్రిగారు ఎగ్జైట్‌గా ఫీలై చాలా మంచి కంటెంట్ చెప్పబోతున్నారని అభినందించి నందుకు మంత్రి గారికి మా చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక కంటెంట్ విషయానికి వస్తే అసలు ఈ సమాజంలో దేవుడు, దయ్యము,సైన్స్ పైన చాలా అనుమానాలు, అపోహలున్నాయి. వాటిని నిగ్గు తేల్చడానికే మేం దమ్మున్న కథతో మీ ముందుకు వస్తున్నాము.ఎందుకంటే.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో హర్రర్ సినిమాలు,దేవుళ్ళ సినిమాలు, సైన్స్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ…ఈ మూడింటిని కలకలిపి వీటిలో అసలు ఏది వాస్తవం?ఏది అబద్దం అనే విషయాన్ని మేం చెప్పబోతున్నాము. హర్రర్ సినిమా అంటే ఒక వర్గానికి పరిమితమైన ప్రేక్షకులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా లవ్, సెంటిమెంట్ ,కామెడీ ,హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. కాలేజీ లో ఉండే ప్రతి సీన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి లవ్ సీన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి హర్రర్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి సినిమాలో ప్రతి సీన్ చాలా కొత్తగా ఉంటాయి . ఇలా డిఫరెంట్ గా ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి అని చాలా సినిమాల్లో ఏదో రిలీజ్ ముందు చాలా డిఫరెంట్ గా ఉంటుందని,మా సినిమా చాలా కొత్తగా ఉంటుందని చెప్పినట్టుగా…మీలో ఎక్స్పెక్టేషన్ పెంచుకోవడానికో,నేను ఆవేశంతో చెబుతున్న మాటలు కావు. వాస్తవంగా చెబుతున్నాను ,బల్ల గుద్ది చెబుతున్నాను.ప్రతి సీన్ మాత్రం ఎక్సలెంట్ గా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటాయి.రేపు మీరు మా సినిమా చూసిన తర్వాత కూడా ఇదే మాట చెబుతూ డిఫరెంట్ గా ఉందంటూ మీరంతా మంచి రివ్యూ కూడా ఇస్తారు. సినిమాలో ప్రతి సీన్ చూస్తున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతూ..నెక్స్ట్ ఏంటి ,నెక్స్ట్ ఏంటి అంటూ చివరి క్షణం వరకు చాలా ఉత్కంఠ భరితంగా సాగే మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.సమాజానికి అసలు ఇన్నాళ్లు ఏది వాస్తవం అని తెలియకుండా…ఒక ప్రశ్నగా మిగిలిపోయిన దానికి అసలు వాస్తవం చెప్పబోతున్నాను.మంచి సందేశంతో వస్తున్న ఈ సినిమాకి కథే హీరో. కథే కథానాయకుడు అయినటువంటి మా చిత్రం ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని చెప్పబోతున్నాను.ఎందుకంటే ఒక సీనియర్ సినిమా విశ్లేషకులు ఒక మాట చెప్పారు ఈ సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని. ఎందుకంటే హర్రర్ సినిమాలు అంటే ఒక బిల్డింగ్ లోనో, ఒక అడవిలోనో ఇంకా ఏదేదో చేస్తుంటారు.కానీ మీరు తీసిన హర్రర్ సినిమాలో లవ్ ని, సెంటిమెంట్ ని, కామెడీని ని యాక్షన్ ని సస్పెన్స్ ని హర్రర్ ని థ్రిల్లర్ ని దాంతోపాటు మంచి మెసేజ్ ను మిక్స్ చేసి చేయడమనేది అసాధ్యం కానీ మీరు అలాంటి చిత్రం తీశారు అంటే ఇప్పటివరకు తీసిన హర్రర్ సినిమాలకు మించి డిఫరెంట్ గా కొత్తగా వస్తున్న చిత్రం అని ప్రశంసించారు.వారు ప్రశంసించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,వారు ఎవరనేది ముందు ముందు ప్రెస్మీట్లో చెబుతాను.రేపు మా చిత్రం రిలీజ్ తర్వాత కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతుందని భావిస్తున్నాను.మరొక్కసారి మా చిత్రం ట్రైలర్ ని లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ…కథే కథానాయకుడు అయినటువంటి మా చిత్రం సెప్టెంబర్ 10న థియోటర్స్ లో చూసి ఆదరిస్తారని భావిస్తూ ప్రేక్షక దేవుళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని దర్శకుడు మాట్లాడారు.
ఈ చిత్రంలో హీరోలు: ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందుహీరోయిన్లు: స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని,వాణికామెడీ పాత్రలో..జూనియర్ సంపుఇతర తారాగణం: స్వప్న,శ్రష్టి వర్మ,”వేదం”నాగయ్య, గోవింద్,నల్లి సుదర్శన రావు,”జానపదం”అశోక్, సూర్య,సంతోష్,రమణ.ఎడిటింగ్: సునీల్ మహారాణడి.ఓ.పి: డి.యాదగిరిసంగీతం: యు.వి.నిరంజన్లైన్ ప్రొడ్యూసర్: కె.బాలకృష్ణనిర్మాత: కొమారి జానయ్య నాయుడుకథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కొమారి జానకిరామ్