ఆర్టిస్ట్స్ః
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేష్ , పెద్ద వంశీ, ప్రేమ్ కుమార్ పాత్రో,
మాస్టర్ రక్షిత్, మాస్టర్ చరణ్, మోహన్, వివేక్ థాకూర్, నందగోపాల్ తదితరులు
టెక్నీషియన్స్ః
బ్యానర్: శ్రీహార్‌సీన్ ఎంటర్‌టైన్మెంట్
సంగీతం, పాటలు, స్టంట్స్, ఎడిటింగ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బండి సరోజ్
నిర్మాత: క్రాంతి కుమార్ తోట
రేటింగ్ః 3/5
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సూర్యాస్తమయం
. శ్రీహార్‌సీన్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ గురించి చేప్పిన ఆసక్తికరమైన మాటలతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. పాటలు కూడా సినిమా పై మరింత క్రేజ్ ని ఏర్పరిచాయి. ఒక చక్కటి తెలుగు టైటిల్ తో ఈ వారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…..
కథలోకి వెళితే…
ఒక పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాలలో చదువుతోన్న సూర్య అనే కుర్రాడి (ప్రవీణ్ రెడ్డి) యాటిట్యూడ్ నచ్చి ఇన్ స్పైర్ అవుతాడు అప్పారావు. తన కన్నా చిన్న వాడు కావడంతో అప్పారావుని పెద్దగా పట్టించుకోడు సూర్య . కానీ ఊళ్లో అందరితో సూర్య నా ఫ్రెండ్ అని అప్పారావు అందరితో చెప్పుకుంటుంటాడు. ఓ రోజు సూర్యకి ఇది తెలుస్తుంది. చిన్న గొడవ తర్వాత అప్పారావు స్నేహం విలువ తెలుసుకుంటాడు సూర్య. అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. కానీ కొంత కాలం తర్వాత విడిపోతారు. సూర్య ని ఇన్ స్పైర్ గా తీసుకున్న అప్పారావు అలియాస్ చేగెవారా పోలీస్ ఆఫీసర్ అవుతాడు. మరి సూర్య ఎక్కడికివెళ్లాడు. వీరిద్దరూ మళ్ళీ కలుసుకున్నారా? అసలు వీరిద్దరు ఎందుకు? విడిపోయారు అన్నది మిగతా కథ.
ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ః
చేగెవారాగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన యాటిట్యూడ్ డైలాగ్ డిక్షన్ తో బండి సరోజ్ కుమార్ అదరగొట్టాడు అని చెప్పవచ్చు. అలాగే సూర్య పాత్రలో ప్రవీణ్ రెడ్డి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇద్దరూ మిత్రులుగా, శత్రువులుగా పోటాపోటీగా నటించారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పెద్ద వంశీ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. అలాగే పాపులర్ యాక్టర్ డానియల్ బాలాజీ పాత్ర సినిమాకు కీలకంగా నిలిచింది. హీరోయిన్స్ తన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్నారు. హీరోతో ఉండే బీబీసీ రిపోర్టర్ కమెడియన్ గా ఆకట్టుకున్నాడు.
టెక్నీషియన్స్ వర్క్ః
ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి బండి సరోజ్ కుమార్ అన్నీ తానై సినిమాను రూపొందించాడు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం, సంగీతం, హీరో ఇలా దాదాపు 11 శాఖలను తనే నిర్వహించాడు. కథ, కథనాలతో పాటు డైలాగ్స్ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయని చెప్పవచ్చు. ఫ్రెండ్ షిప్ మీద వచ్చే పాటతో పాటు లవ్ సాంగ్ , నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రపీ, ఎడిటింగ్ సినిమాకు తగట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
అనాలసిస్ …
బండి సరోజ్ కుమార్ తీసుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ దానికి తగ్గ తెలిసిన తారలను ఎంచుకోనుంటే బాగుండేది అనిపించింది. ఇద్దరు మంచి మిత్రులు చివరికి శత్రువులుగా మారడం ఒకరినొకరు చంపుకునే పరిస్థితి రావడం అనేది ఇంట్రస్టింగ్ పాయింట్. అసలు వీరిద్దరు ఎందుకు విడిపోయారన్నది సినిమాకు కీలకం. లవ్ స్టోరి కూడా చాలా ఇంట్రస్టింగ్ ఉంటుంది. సూర్య ని ఇన్ స్పైరింగ్ గా తీసుకుని అప్పారావు చెగేవారా ఎంత ఎత్తుకు ఎదుగుతాడు కానీ, ఇన్ స్పిరేషన్ ఇచ్చిన సూర్య మాత్రం ఒక డాన్ గ్యాంగ్ లో చిక్కుకుంటాడు అనేది సినిమాకు కీలకం. తెలిసన ఆర్టిస్టులతో ఇంకా కొంచెం పబ్లిసిటీ బాగా చేసుంటే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఉండేది. దర్శకుడు ప్రతి దాంట్లో కొత్తదనం , విభిన్నత చూపించాలన్న తాపత్రయాన్ని మెచ్చుకోవాలి. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో వచ్చిన ఓ డిఫరెంట్ చిత్రాన్ని సూర్యాస్తమయం. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు.