మా పాప మానసిక దివ్యాంగురాలకు పింఛన్ మంజూరు చేయండి… అధికారులకు ఓ తల్లి అభ్యర్థన

అసలే భర్త లేడు దీనికి తోడు ఇద్దరు ఆడపిల్లలు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఒక పాప మానసిక దివ్యాంగురాలు. అయితే ఆమె హోటల్స్, ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఆడపిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ… మానసిక దివ్యాంగురాలైన పాప వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతూ కాలం గడుపుతుంది ఆ కుటుంబం… మానసిక వికలాంగురాలుగా ఉన్న తన పాపకు దివ్యాంగుల పింఛను వస్తే కొంతయినా ఆసరాగా ఉంటుందని ఎదురు చూస్తోంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పింఛన్ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

మంగళగిరి కొత్తపేటలోని కంసాని ఉషారాణి అనే మహిళ కు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద పాప అక్షయకు 10 సంవత్సరాల వయసు, ఆ పాప మానసిక దివ్యాంగురాలు అవ్వడంతో అన్ని మంచంలోనే ఆ తల్లి చూసుకుంటుంది. అక్షయకు 90% వికలాంగత్వంతో సదరన్ సర్టిఫికెట్ 4 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఈ పాపకు దివ్యాంగుల పింఛన్ మంజూరు కాలేదు. అయితే అధికారులు పాపకు ప్రజా సాధికార సర్వే అవ్వలేదు, వేలిముద్రలు పడటం లేదు అంటూ పింఛన్ మంజూరు చేయడం లేదు. అక్షయకు ప్రతి నెల 3 నుంచి 4 వేల రూపాయల వరకు వైద్య ఖర్చులు అవుతూ ఉంటాయి. పాప తల్లి ఉషారాణి హోటల్స్, ఇళ్లల్లో పని చేస్తూ గత వారం నుండి రోడ్డు పక్కన టీ, కాఫీ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంతుంది. తన భర్త వదిలేశాడని తానే ఇద్దరు పిల్లలను పోషించు కావాలని పెద్ద పాప అక్షయకు దివ్యాంగురాలు పింఛన్ మంజూరు చేస్తే తమకు కొంత ఆసరాగా ఉంటుందని అధికారులను వేడుకుంటుంది.
-News by: బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.