నేడు ప్రపంచ మానవతా దినోత్సవం
ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైన కనిపించడం కష్టమైపోయింది. అంతేకాదు మానవత్వ మనుగడనే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అందరికంటే ముందుగా మన దేశ సైనికులు అసాధారణ సేవలందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సైనికులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అత్యంత సాహసోపేతంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరి మన్ననలను పొందారు.
చరిత్ర:
2003లో ఇరాక్ దేశంలో బాగ్దాద్‌లోని ఐక్యరాజ్యసమితి ముఖ్య కార్యాలయంలో ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో అప్పటి సెక్రటరీ జనరల్‌కు ఇరాక్ ప్రత్యేక ప్రతినిధి సెర్గియో వియరడి మెల్లోతో సహా 21 మంది వారి అనుచరులు అక్కడికక్కడే మరణించారు. అందుకు గుర్తుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 19న ప్రపంచ మానవత్వ దినోత్సవంగా ప్రకటించారు. మానవతా సిబ్బందిని గుర్తించేందుకు, మానవీయ కారణాల కోసం తమ ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితమిచ్చే ప్రత్యేకమైన రోజు ఈరోజు. ఇది ప్రపంచం మొత్తం మానవత్వ కృషికి స్ఫూర్తినిస్తోంది. మానవతావాదం ఐక్యతను ప్రసాదిస్తుంది. ఇది స్వేచ్ఛ, జ్ఞానం, నీతి కోసం హేతువు, ఐక్యత వల్ల కూడా సహనం పెరుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మందిలో ఐక్యత కొరవడింది. ప్రతిదానికి స్వార్థం పెరిగిపోయింది. డబ్బుతోనే ప్రతిదాన్ని ముడిపెడుతున్నారు. డబ్బే సర్వస్వం కాదని అందరూ గుర్తుంచుకోవాలి.