సకల గుణాభిరామ” ఫస్ట్ లుక్ లాంచ్*
*E.I.P.L పతాకంపై వి.జే సన్నీ,,శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “సకల గుణాభి రామ”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ పాత్రికేయుల సమక్షంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.. ఈ సందర్భంగా*
*చిత్ర హీరో వి.జే సన్నీ మాట్లాడుతూ..* నా జర్నీ మీడియా నుంచే ప్రారంభమైంది, నేను ఫస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ గా పనిచేశాను.ఆ తరువాత సినిమా మీద ఇష్టం తో మూవీస్ లోకి వచ్చాను. నేను సినిమాలలోకి రావడానికి హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఇన్స్పిరేషన్. తను మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. తరువాత నన్ను హీరో గా చేసిన డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ గారు నాకు మరో ఇన్స్పిరేషన్ అయనకు నా ప్రత్యేక ధన్యవాదములు, మీడియా నుండి సీరియల్ కు ఇప్పుడు హీరో గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాకు వర్క్ చేసిన డి.ఓ.పి నళినీ కాంత్ కెమెరా వర్క్ సూపర్బ్ అని చెప్పవచ్చు, ఇంక మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులోని యూ ఒక సాంగ్ ఈ ఇయర్ లో ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది.. అలాగే నిర్మాత సంజీవ రెడ్డి గారు ఖర్చుకి వెనకాడ కుండా సినిమాను పూర్తి చేశారు. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు..
*హీరోయిన్స్ ఆషిమా నర్వాల్ తరుణి లు మాట్లాడుతూ…* మాకు ఇంతమంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన నిర్మాత సంజీవ రెడ్డి , మరియు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ వెలిగొండ శ్రీనివాస్ గారికి మా ధన్యవాదములు తెలుపు కుంటున్నాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు,అలాగే నా కో స్టార్స్ సన్నీ అందరూ చాలా బాగా సహకరించారు. కుటుంబ సమేతంగా వచ్చి చూడవలసిన మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.
*మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.* . ప్రతి సినిమాకు కథతో పాటు పాటలు కూడా ఎంతో ముఖ్యం. ఈ సినిమాకు సింహ మూడు పాటలు రాయడం జరిగింది. తాను రాసిన పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ చిత్ర దర్శక,నిర్మాతల సహకారంతో చిత్రంలోని పాటలు చాలా బాగా వచ్చాయి.ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.
*పాటలు రచయత సింహ మాట్లాడుతూ* … ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరియు డైరెక్టర్ కి నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అని చెపుతు ఈ మూవీ లో నేను మూడు పాటలు రాసాను చాలా బాగా వచ్చాయి ఈ మూవీ సాంగ్స్ ఈ మూవీ ని చూసి నన్ను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను అని తెలియచేసాడు.
*డి.ఓ.పి నళిని కాంత్ కొండపల్లి మాట్లాడుతూ..* ఈ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు
*చిత్ర దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ..* నేను మంచి కాన్సెప్ట్ తో ఈ కథను తయారు చేసుకొని
నిర్మాతలు సంజీవరెడ్డి గారికి ఈ కథ చెప్పడం జరిగింది. నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో నామీద నమ్మకంతో ఈ మూవీని తమ E.I.P.L బ్యానర్ మీద చెయ్యడానికి ఒప్పుకున్నారు. సినిమాకు కావలసిన ఏర్పాట్లు చేసుకొమ్మని చెప్పడమే గాక ఖర్చు గురించి వెనకాడవద్దు అని నన్ను ప్రోత్వహించారు , బాను మరియు నందు నా రైటింగ్స్ లో నాకు చాలా సహకారం అందించారు వాళ్ళకి నా కృతజ్ఞతలు.హీరోలు వి.జె.సన్నీ, నారప్పలో నటించిన శ్రీతేజ్, మరియు హీరోయిన్ లు చాలా చక్కగా నటించారు. సకల గుణాలు కలిగిన రాముడు అయినా భర్త తో భార్య భర్తల మధ్య ఎమోషన్స్ రొమాన్స్ మరియు కామెడీ మధ్య జరిగే సినిమానే మా “సకల గుణాభి రామ” మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.
*చిత్ర నిర్మాత సంజీవ రెడ్డి మాట్లాడుతూ…* శ్రీనివాస్ వెలిగొండ నాకు కథ చెప్పడంతో నాకు ఈ కథ డీఫ్రెంట్ గా అనిపించి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. సినిమా బాగా వచ్చింది. అనుదీప్ మంచి సంగీతం అందించాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
*నటినటులు* :
వి.జె.సన్నీ,,శ్రీ తేజ్ (నారప్ప), ఆషిమా నర్వాల్, తరుణీ, చమ్మక్ చంద్ర మహేష్ విట్ట, సరయు, సింగ్డా తదితరులు
*సాంకేతిక నిపుణులు :*
బ్యానర్ :E.I.P.L ప్రొడక్షన్స్
సినిమా :- “సకల గుణాభిరామ”
నిర్మాత :- సంజీవ రెడ్డి
స్టోరీ, రైటర్,డైలాగ్స్, డైరెక్షర్ :- శ్రీనివాస్ వెలిగొండ
స్క్రీన్ ప్లే :- బాను, నందు
డి.ఓ.పి -నళిని కాంత్ కొండపల్లి
మ్యూజిక్ డైరెక్టర్ :అనుదీప్
ఎడిటర్ :- వెంకట రెడ్డి
కో.డైరెక్టర్ :- దీపక్
ఆర్ట్ డైరెక్టర్ :-వెంకటేష్
పి.ఆర్.ఓ :- హర్ష