ఆహా`లో ఆగస్ట్ 13న మంజు వారియర్ టెక్నో హారర్ థ్రిల్లర్ `చతుర్ముఖం`… ఆకట్టుకుంటున్న ట్రైలర్
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా`లో మంజు వారియర్, సన్నీ వైనే, శ్రీకాంత్ మురళి ప్రధాన పాత్రధారులుగా నటంచిన టెక్నో హారర్ థ్రిల్లర్ `చతుర్ముఖం` ఆగస్ట్ 13న విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని రంజిత్ కామల శంకర్, సలిల్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి మలయాళ మాతృక.. బుసాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎఫ్ఏఎన్), చుంచియాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(సీఐఎఫ్ఎఫ్), మేలిస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్(ఎంఐఎఫ్ఎఫ్) ఇలా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బుధవారం ఈ థ్రిల్లర్ ట్రైలర్‌ను `ఆహా` విడుదల చేసింది.
చతుర్ముఖం.. ప్రస్తుత కాలానికి చెందిన తేజస్విని అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన స్వతంత్య్ర భావాలున్న మహిళ తేజస్విని జీవితం చుట్టూ తిరిగే కథ. తేజస్వినికి టెక్నికల్‌గా మంచి అవగాహన ఉంటుంది. ఆమె ఆలోచనలు, చర్యలు ఉన్నతంగా, ప్రాక్టికల్‌గా ఉంటాయి. ఫోన్ లేకుండా సమయాన్ని గడపటానికి ఇష్టపడని ఆమె, కొన్ని మిస్టరీ పరిస్థితుల నేపథ్యంలో ఓ కొత్త ఫోన్‌ను కోనుగోలు చేస్తుంది. అయితే ఆమె జీవితం దుర్భరంగా మారిపోతుంది. ఆమె చుట్టూ జరుగుతున్న అతీంద్రీయ మిస్టరీ పరిస్థితులను తెలుసుకోవడానికి సమస్యలను చేదించడానికి తన స్నేహితుడు ఆంటోని సహాయాన్ని ఆమె కోరుతుంది. వారెలా ఆ సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారు. ఎలా భయటపడారనేదే కథ. ఈ సినిమాను చూసే ప్రేక్షకుడు మరింత ఆసక్తిని కనపరుస్తాడనటంలో సందేహం లేదు.
ప్రస్తుతం నెలకొన్న సాంకేతిక సమాజంలో వావస్తవికతను తెలియజేసే తేజస్విని అనే శక్తివంతమైన మహిళ పాత్రలో మంజు వారియర్ అద్భుతంగా నటించారనడానికి `చతుర్ముఖం` మంచి ఉదాహరణ. ఇండియన్ సినిమాలో విలక్షణమైన జోనర్‌లో రూపొందించబడిన ఈ చిత్రంలో ప్రేక్షకులకు ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. అభయ్ కుమార్ కె, అనిల్ కురియరన్ రచించిన ఈ చిత్రానికి డాన్ విన్సెంట్ సౌండ్ డిజైన చేశారు. అభినందన్ రామానుజం అద్భుతమైన విజువల్స్ అందించారు. జిస్ టామ్స్ మూవీస్, మంజు వారియర్ బ్యానర్స్‌పై జిస్ టామ్స్, జస్టిన్ థామస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
`ఆహా` తన ఆడియెన్స్ కోసం తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. లేటెస్ట్ సమంత అక్కినేని, విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ డీలకర్, మమ్ముట్టి వన్, నయనతార నీడ, హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం విజయ్ సేతుపతిలతో పాటు దేశంలో మొట్టమొదటి సైంటిఫిక్ క్రైమ థ్రిల్లర్ వెబ్ షో కుడిఎడమైతేను అందించింది. ఇందులో అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా నటించగా పవన్‌కుమార్ డైరెక్ట్ చేశారు. అలాగే లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా చేస్తున్న ఆహా ఫుడ్ షో ఆహా భోజనంబును అందించింది ఆహా. ఈ ఆహా భోజనంబులో విష్వక్ సేన్, రకుల్ ప్రీత్, తరుణ్ భాస్కర్ తదితరులు పాల్గొని తమ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక ఈ ఏడాదిలో క్రాక్, నాంది, 11 అవర్, జాంబిరెడ్డి, చావు కబురు చల్లగా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు, షోతో తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆహా ప్రేక్షకులకు అందిస్తోంది.
ఆహా`లో ఆగస్ట్ 13న మంజు వారియర్ టెక్నో హారర్ థ్రిల్లర్ `చతుర్ముఖం`... ఆకట్టుకుంటున్న ట్రైలర్