బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ `స్టూవర్ట్‌పురం దొంగ` అనౌన్స్‌మెంట్
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. యాక్షన్ సినిమాలను చేయడానికి చాలా ఆసక్తిని చూపుతుంటారు. తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన `ఛత్రపతి` చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తుండగా, ఆ రీమేక్ ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్‌గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `స్టూవర్టుపురం దొంగ` పేరుతో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ `టైగర్ నాగేశ్వర రావు` బయోపిక్ ఇది.
నాగేశ్వరరావు తన జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాక చాక్యంగా తప్పించుకున్నాడు. చెన్నై జైలు నుంచి నాగేశ్వరరావు తప్పించుకున్న తీరుతో ఆయనకు `టైగర్` అనే పేరు వచ్చింది. పోలీసులను ముప్ప తిప్పలు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఈ విషయాలతో `స్టూవర్టుపురం దొంగ` సినిమాను తెరకెక్కించబోతున్నారు.
స్టూవర్టుపురంలోని నాగేశ్వరరావు ఇల్లు టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఆయన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆయన ఫొటో వేలాడుతుంటుంది. మోస్ట్ వాంటెడ్ దొంగగా పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను పర్‌ఫెక్ట్ టైటిల్, `స్టూవర్టుపురం దొంగ` పేరుతో సినిమాగా మలుస్తున్నారు. ఈ పాత్రను చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్ పర్‌ఫెక్ట్ చాయిస్. టైటిల్ పోస్టర్ విషయానికి వస్తే, ఆవిరితో నడిచే రైలు బండి పొగను విడుస్తుంది. ఆ ట్రెయిన్ స్టూవర్ట్‌పురం గ్రామం మీదుగా వెళుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అని మేకర్స్ తెలియజేశారు.
మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పరిచయం చేసిన కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న `స్టూవర్టుపురం దొంగ` చిత్రంతో కె.ఎస్. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా తన ప్రెస్టీజియస్ బ్యానర్ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తూ నిర్మాతగా కమ్‌బ్యాక్ అవుతున్నారు.
భారీ చిత్రంలో ఉండాల్సిన కమర్షియల్ అంశాలన్నీ తగు పాళ్లలో ఉండేలా అద్భుతమైన స్క్రిప్ట్‌ను రాశారు. వెన్నెలకంటి సోదరులు ఈ చిత్రానికి రచయితలు. 1970-80 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం ప్రముఖ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.
నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్
సాంకేతిక వర్గం:
డైరెక్టర్: కె.ఎస్
నిర్మాత: బెల్లంకొండ సురేశ్
రైటర్స్: వెన్నెలకంటి బ్రదర్స్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్