ఆషాఢమాసం అమావాస్యని పురస్కరించుకుని మంగళగిరి లక్ష్మీ నృసింహుని కొండ శిఖర భాగాన ఉన్న శ్రీ గండాలయ స్వామి వారి ఆలయం వద్ద ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుండే కొండపైకి ద్విచక్ర వాహనాలు, కాలినడకన తో కొండపైకి చేరుకుని గండాలయ స్వామికి నూనెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు భక్తులకి ప్రసాదాలని పంపిణీ చేశారు.
◆ భక్తులకి తప్పని ఇబ్బందులు
భక్తులు అధిక సంఖ్యలో కొండ శిఖర భాగానికి చేరుకోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎండవేడి తీవ్రంగా ఉండడంతో నిలువ నీడ లేకుండా పోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వర్షంలో తడుచుకుంటునే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గతంలో భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో స్వామి వారి ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అధికారులు స్పందించి భక్తుల సౌకర్యార్థం షెడ్డు, త్రాగు నీరు, ఆలయం చుట్టూ రైలింగ్ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. *రిపోర్ట్ బై : వాసు విడేల