దిశ యాప్ అవగాహన సదస్సులో తూ.గో జిల్లా ఎస్పీ శ్రీ M. రవీంద్రనాథ్ బాబు

మహిళలకు అభయ హస్తం దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ M. రవీంద్రనాథ్ బాబు, IPS గారు

ఈ రోజు పిఠాపురం గ్రామం నందు నిర్వహించబడిన దిశ SOS యాప్ మరియు మహిళల భద్రతా అంశాలపై నిర్వహించిబడిన అవగాహనా సదస్సులో జిల్లా SP శ్రీ M. రవీంద్రనాథ్ బాబు, IPS గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ MP శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం MLA శ్రీ పెండెం దొరబాబు లు ముఖ్య అతిధులుగా హాజరైనారు.

ఈ సందర్భంగా SP గారు మాట్లాడుతూ, ప్రతి మహిళ యొక్క మొబైల్ ఫోన్లో దిశ యాప్ ఉంటే కనబడని ఒక రక్షక భటుడు రక్షణ కోసం మీ వెంట ఉన్నట్లేనని, దిశ యాప్ డౌన్లోడ్ పట్ల అలసత్వం ప్రదర్శించకూడదు, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని , దాని యొక్క ఆవశ్యకత, ఉపయోగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో CWC చైర్ వుమన్ శ్రీమతి M.పద్మావతి, కాకినాడ DSP శ్రీ V.భీమారావు, DSP దిశ పోలీస్ స్టేషన్ శ్రీ S. మురళి మోహన్, కాకినాడ లోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఇతర DSP లు, CI లు, SI లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.