అనుమతులు లేని పశువులను అక్రమంగా రవాణాకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరే పరిధిలో పశువు అక్రమ రవాణాను నియంత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ మరియు పశుసంవర్థక శాఖ, రోడ్డు రవాణా, గ్రేటర్ మున్సిఫల్ అధికారులతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పశువుల సంతలో పశువుల అమ్మకాలు, కోనుగోళ్ళు జరిగే ప్రదేశాల్లో పోలీసు మరియు పశుసంవర్థక శాఖ అధికారులు నిఘా ఉంచాలన్నారు. సంతలో కోనుగోలు చేసిన పశువులకు సంబంధిత పశువైధ్యకారిచే జారీచేసిన అరోగ్య, రవాణాకు అనుమతి పత్రాలు తీసుకొవడం తప్పనిసరని అన్నారు. ఈ సర్టిఫికేట్లు తప్పనిసరిగా వాహనదారుని వెంటవుండాలని. ఏ జాతికి చెందిన ఆవులు గాని వ్యవసాయానికి ఉపయోగకరమైన ఎద్దులు,దూడలుగాని వధశాలకు తరలించడం చట్టరిత్యా నేరం. వాహనంలో పశువులను తరలించే సమయంలో పశువు పశువుకు మధ్య తప్పనిసరిగా రెండుమీటర్ల దూరం వుండాలని.నియమాలను పాటించని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయబడుతాయని. కమిషనరేట్ పరిధిలో పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి ఇరువైనాలుగు గంటలు తనీఖీ నిర్వహించబడుతుందని. ఇందుకోసం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల సరిహద్దులతో పాటు జనగామ జిల్లా సరిహద్దులో చెక్ పోస్ట్ లను ఎర్పాటు చేయడం జరుగుతోందని పోలీస్ కమిషనర్ తెలిపారు. అదే విధంగా ఎవరికైన వాహనాల్లో పశువుల రవాణా జరుగుతున్నట్లుగా సమాచారం అందితే పోలీసు అధికారులకు సమాచారం అందించాలి కాని సదరు వ్యక్తులు పశువులు తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవడం వాహనంపై మరియు డ్రైవర్ పై దాడులకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులను నమోదుచేయడుతాయని. ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా పాత ఫోటోలు, దృశ్యాలు, వీడియోలు, సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం షేర్ చేయడంలాంటి చర్యలకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై సైబర్ మరియు క్రిమినల్ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేయబడుతాయని. అలాగే ఎలాంటి అనుమతులు లేని పశువులు, దూడలను వధశాలకు అక్రమంగా తరలించడం కూడా నేరంగా పరిగణించబడుతుందని. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమిషనరేట్ ప్రజలు పోలీసులు పూర్తి సహకారాన్ని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈస్ట్ , సెంట్రల్ జోన్ డిసిపిలు వెంకటలక్ష్మి , పుష్పా, అదనపు డిసిపి జనార్థన్ ,ఎ.సి.పిలు జితేందర్ రెడ్డి , గిరికుమార్, రవీందర్ కుమార్,బాలస్వామి, వరంగల్ అర్బన్, రూరల్ పశుసంవర్థక శాఖ జిల్లా అధికారులు డా. కె.వి నారయణ, డా.బాలకృష్ణ వరంగల్ మున్సిఫల్ అరోగ్య విభాగం అధికారి రాజారెడ్డితో పాటు ఇన్స్‌స్పెక్టర్లున పాల్గోన్నారు