హీరో సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపిన ` గాడ్సే` చిత్ర యూనిట్.
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యంగ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా గోపీగణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్సే’. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సి.కె. స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, కిశోర్ కీలక పాత్రధారులు. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు టాలెంటెడ్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా మరో పోస్టర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. తన ఎడమచేతిలో గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్స్‌తో సత్యదేవ్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ని బట్టి చూస్తే ఇప్పటివరకూ చేయని భిన్న తరహా క్యారెక్టర్‌లో ‘గాడ్సే’గా సత్యదేవ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అని తెలుస్తోది. ఈ నెల ద్వితియార్థం నుండి ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను కూడా గోపీగణేష్ పట్టాభి అందిస్తున్నారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. సి.వి.రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తారాగణం – సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ, నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, కిశోర్
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం – గోపీగణేష్ పట్టాభి
నిర్మాత – సి. కళ్యాణ్
బ్యానర్ – సి.కె. స్క్రీన్స్
సంగీతం – సునీల్ కశ్యప్
ఆర్ట్ – బ్రహ్మ కడలి
సహ నిర్మాత – సి.వి.రావు