ఆకట్టుకుంటోన్న`డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` థీమ్ సాంగ్..
`118`వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందుతోన్న మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంఛనాల్ని భారీగా పెంచాయి. తాజాగా చిత్రం నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ కొత్తగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో హీరో, హీరోయిన్ భయపడుతుండగా…మధ్యలో ఓ మాస్క్ ఉంది. క్రియేటివ్‌గా ఉన్నఈ పోస్టర్‌తో పాటు కేవలం మ్యూజిక్‌తోనే సినిమా కాన్సెప్ట్ తెలియజేసే విధంగా సాగే థీమ్ సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేధిని ప్రకటించనున్నారు నిర్మాతలు..
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి..
బ్యానర్: రామంత్ర క్రియేషన్స్
సంగీతం: సైమన్ కె. కింగ్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
ఆర్ట్: నిఖిల్ హాసన్
డైలాగ్స్: మిర్చి కిరణ్,
లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్,
స్టంట్స్: రియల్ సతీష్,
కాస్ట్యూమ్ డిజైనర్: పొన్మని గుహన్
ప్రొడక్షన్ కంట్రోలర్: కె. రవి కుమార్,
కో–ప్రొడ్యూసర్: విజయ్ ధరణ్ దాట్ల,
నిర్మాత: డా. రవి పి.రాజు దాట్ల,
కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్