మోహన్‌బాబు గారి అభినందన గొప్ప అనుభూతి– దర్శకుడు రామ్
నారాయణ్
అల్తాఫ్ హసన్ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజేలు హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’. సెవెన్‌హిల్స్ సతీశ్, రామ్ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే రూపొందించారు. ‘బట్టల రామస్వామి బయోపిక్’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి…’ చిత్రాన్ని చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. ఇదంతా ఒకెత్తయితే మంచు మోహన్‌బాబు సినిమాను చూసి దర్శకుడు రామ్ నారాయణ్‌ను పిలిపించుకుని అభినందించటం విశేషం. తనకు సినిమా ఎంతగానో నచ్చిందంటూ సినిమా షూటింగ్ విశేషాలను, ఎన్ని రోజుల్లో సినిమాను తెరకెక్కించారు, ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు అని అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారట. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ నారాయణ్ మాట్లాడుతూ–‘‘ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కరోనా సమయం అయినప్పటికీ సినిమా నచ్చటంతో నిన్ను వ్యక్తిగతంగా అభినందించాలి అని పిలిపించాను అన్నారు. మోహన్‌బాబు గారి వంటి లెజెండ్ మా సినిమాను చూసి కరోనా సమయం అయినప్పటికీ నన్ను ఆహ్వానించి అభినందనలు చెప్పటం అది ఆయన గొప్పతనం. సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. కానీ, మోహన్‌బాబు గారు ‘‘సన్నాఫ్ ఇండియా’’ సినిమా రిలీజ్ హడావిడిలో ఉండి కూడా నన్ను పిలిపించి మాట్లాడటంతో ఇది మా సినిమాకు దక్కిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నా’’ అన్నారు.మోహన్‌బాబు గారి అభినందన గొప్ప అనుభూతి– దర్శకుడు రామ్ నారాయణ్ అల్తాఫ్ హసన్ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజేలు హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’. సెవెన్‌హిల్స్ సతీశ్, రామ్ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే రూపొందించారు. ‘బట్టల రామస్వామి బయోపిక్’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి…’ చిత్రాన్ని చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. ఇదంతా ఒకెత్తయితే మంచు మోహన్‌బాబు సినిమాను చూసి దర్శకుడు రామ్ నారాయణ్‌ను పిలిపించుకుని అభినందించటం విశేషం. తనకు సినిమా ఎంతగానో నచ్చిందంటూ సినిమా షూటింగ్ విశేషాలను, ఎన్ని రోజుల్లో సినిమాను తెరకెక్కించారు, ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు అని అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారట. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ నారాయణ్ మాట్లాడుతూ–‘‘ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కరోనా సమయం అయినప్పటికీ సినిమా నచ్చటంతో నిన్ను వ్యక్తిగతంగా అభినందించాలి అని పిలిపించాను అన్నారు. మోహన్‌బాబు గారి వంటి లెజెండ్ మా సినిమాను చూసి కరోనా సమయం అయినప్పటికీ నన్ను ఆహ్వానించి అభినందనలు చెప్పటం అది ఆయన గొప్పతనం. సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. కానీ, మోహన్‌బాబు గారు ‘‘సన్నాఫ్ ఇండియా’’ సినిమా రిలీజ్ హడావిడిలో ఉండి కూడా నన్ను పిలిపించి మాట్లాడటంతో ఇది మా సినిమాకు దక్కిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నా’’ అన్నారు.
'బట్టల రామస్వామి బయోపిక్' కి మోహన్ బాబు అభినందన