గుడివాడలో 21 కోట్ల వ్యయంతో బస్టాండ్..శంకుస్థాపన చేసిన కొడాలి నాని

గుడివాడ, జూలై 2: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో రూ. 21.31 కోట్ల వ్యయంతో ఆర్టీసీ బస్టాండ్ ను అధునాతన హంగులతో నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి మంత్రి కొడాలి నాని భూమిపూజ, శంఖుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 50 ఏళ్ళ కిందట గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పడిందని చెప్పారు. కొద్దిపాటి వర్షం కురిసినా బస్టాండ్ మునిగిపోవడం, ఆ నీటిని మోటార్లతో తోడడం ఇప్పటి వరకు జరుగుతూ వస్తోందన్నారు. గ్యారేజ్ కు ఎక్కువ స్థలం, బస్టాండకు తక్కువ స్థలం ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ వచ్చారన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తే నిర్మిస్తామంటూ ఎన్నికల ఎజెండాలో ఆర్టీసీ బస్టాండ్ ను భాగంగా చేశారన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చినప్పటికీ ప్రతిపక్షంలోనే కొనసాగడం జరిగిందని, ఈ కారణంగా బస్టాండ్ ను నిర్మించలేకపోయానని చెప్పారు. 2019 ఎన్నికల్లో నాల్గవసారి గెలవడంతో పాటు సీఎం జగన్మోహనరెడ్డి కేబినెట్ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టానని చెప్పారు. మరోవైపు మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెల్చిన పేర్ని వెంకట్రామయ్య (నాని) కూడా రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం తన అదృష్టమన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనను కలిసి గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రూ.21.31 కోట్లు మంజూరు చేయాలని కోరానన్నారు. వెంటనే ఆర్ధికశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి గుడివాడ బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరయ్యాయని, టెండర్లను కూడా పిలిచామన్నారు. కొన్ని కారణాల వల్ల మళ్ళీ టెండర్లను పిలవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్యారేజ్ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయని, ఏడెనిమిది నెలల్లో పూర్తిచేసి ముందువైపు ఉన్న భవనాలను తొలగించి బస్టాండ్ ను నిర్మించడం జరుగుతుందన్నారు. బస్టాండ్ నిర్మాణ పనులు దిగ్విజయంగా ప్రారంభం కావడానికి సహకరించిన మంత్రి పేర్ని నానికి ఆర్టీసీ కార్మికులు, గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ ను రూ.21.31 కోట్లతో అధునాతన హంగులతో నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో ఇంత మొత్తంలో బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదన్నారు. ఆర్టీసీ ఆదాయ మార్గాల గురించి అందరికీ తెలుసని చెప్పారు. ఇప్పుడున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎక్కువగా నష్టపోయిన వ్యవస్థ ఆర్టీసీ అని అన్నారు. అయినప్పటికీ ఆదాయం, ఆస్థులతో సంబంధం లేకుండా గుడివాడ నియోజకవర్గంపై ఉన్న మమకారంతో, ఇక్కడున్న బస్టాండ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహనరెడ్డి పెద్ద మనస్సుతో నిధులను మంజూరు చేశారని మంత్రి కొడాలి నాని చెప్పారు. అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను క్రేన్ తో భారీ గజమాల వేసి ఘనంగా సత్కరించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, కృష్ణా రీజియన్ ఆర్ఎం జీ నాగేంద్రప్రసాద్, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, డిపో మేనేజర్ జీ రాజేష్ కుమార్, డీసీటీఎం సుకుమార్, సీఎంఈ జాన్ సుధాకర్, ఎడ్మిన్ కే కోటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్ బ్రహ్మానందరెడ్డి, పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దారం ఏడుకొండలు, డిపో కార్యదర్శి సీవీకే రావు, అధ్యక్షుడు ఎంఎస్ రాజు, అదనపు కార్యదర్శి మూర్తి, మహిళా కార్యదర్శి జీ రాజకుమారి, సీనియర్ నాయకులు బీఎన్ కోటేశ్వరరావు, పీఎంకే రావు, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నాయకులు పాలడుగు రాంప్రసాద్, కసుకుర్తి బాబ్జి, పెయ్యల ఆదాం, మట్టా జాన్ విక్టర్, మాదాసు వెంకటలక్ష్మి, అల్లం సూర్యప్రభ, పడమట సుజాత, పొట్లూరి వెంకట కృష్ణారావు, గిరిబాబాయ్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, మెండా చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.గుడివాడ, జూలై 2: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో రూ. 21.31 కోట్ల వ్యయంతో ఆర్టీసీ బస్టాండ్ ను అధునాతన హంగులతో నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి మంత్రి కొడాలి నాని భూమిపూజ, శంఖుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 50 ఏళ్ళ కిందట గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పడిందని చెప్పారు. కొద్దిపాటి వర్షం కురిసినా బస్టాండ్ మునిగిపోవడం, ఆ నీటిని మోటార్లతో తోడడం ఇప్పటి వరకు జరుగుతూ వస్తోందన్నారు. గ్యారేజ్ కు ఎక్కువ స్థలం, బస్టాండకు తక్కువ స్థలం ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ వచ్చారన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తే నిర్మిస్తామంటూ ఎన్నికల ఎజెండాలో ఆర్టీసీ బస్టాండ్ ను భాగంగా చేశారన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చినప్పటికీ ప్రతిపక్షంలోనే కొనసాగడం జరిగిందని, ఈ కారణంగా బస్టాండ్ ను నిర్మించలేకపోయానని చెప్పారు. 2019 ఎన్నికల్లో నాల్గవసారి గెలవడంతో పాటు సీఎం జగన్మోహనరెడ్డి కేబినెట్ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టానని చెప్పారు. మరోవైపు మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెల్చిన పేర్ని వెంకట్రామయ్య (నాని) కూడా రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం తన అదృష్టమన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనను కలిసి గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రూ.21.31 కోట్లు మంజూరు చేయాలని కోరానన్నారు. వెంటనే ఆర్ధికశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి గుడివాడ బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరయ్యాయని, టెండర్లను కూడా పిలిచామన్నారు. కొన్ని కారణాల వల్ల మళ్ళీ టెండర్లను పిలవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్యారేజ్ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయని, ఏడెనిమిది నెలల్లో పూర్తిచేసి ముందువైపు ఉన్న భవనాలను తొలగించి బస్టాండ్ ను నిర్మించడం జరుగుతుందన్నారు. బస్టాండ్ నిర్మాణ పనులు దిగ్విజయంగా ప్రారంభం కావడానికి సహకరించిన మంత్రి పేర్ని నానికి ఆర్టీసీ కార్మికులు, గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ ను రూ.21.31 కోట్లతో అధునాతన హంగులతో నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో ఇంత మొత్తంలో బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదన్నారు. ఆర్టీసీ ఆదాయ మార్గాల గురించి అందరికీ తెలుసని చెప్పారు. ఇప్పుడున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎక్కువగా నష్టపోయిన వ్యవస్థ ఆర్టీసీ అని అన్నారు. అయినప్పటికీ ఆదాయం, ఆస్థులతో సంబంధం లేకుండా గుడివాడ నియోజకవర్గంపై ఉన్న మమకారంతో, ఇక్కడున్న బస్టాండ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహనరెడ్డి పెద్ద మనస్సుతో నిధులను మంజూరు చేశారని మంత్రి కొడాలి నాని చెప్పారు. అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను క్రేన్ తో భారీ గజమాల వేసి ఘనంగా సత్కరించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, కృష్ణా రీజియన్ ఆర్ఎం జీ నాగేంద్రప్రసాద్, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, డిపో మేనేజర్ జీ రాజేష్ కుమార్, డీసీటీఎం సుకుమార్, సీఎంఈ జాన్ సుధాకర్, ఎడ్మిన్ కే కోటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్ బ్రహ్మానందరెడ్డి, పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దారం ఏడుకొండలు, డిపో కార్యదర్శి సీవీకే రావు, అధ్యక్షుడు ఎంఎస్ రాజు, అదనపు కార్యదర్శి మూర్తి, మహిళా కార్యదర్శి జీ రాజకుమారి, సీనియర్ నాయకులు బీఎన్ కోటేశ్వరరావు, పీఎంకే రావు, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నాయకులు పాలడుగు రాంప్రసాద్, కసుకుర్తి బాబ్జి, పెయ్యల ఆదాం, మట్టా జాన్ విక్టర్, మాదాసు వెంకటలక్ష్మి, అల్లం సూర్యప్రభ, పడమట సుజాత, పొట్లూరి వెంకట కృష్ణారావు, గిరిబాబాయ్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, మెండా చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.