నేషనల్ అవార్డ్ విన్నర్ బాబీ సింహా హీరోగా ట్రైలింగ్వల్ మూవీ వసంత కోకిల టీజర్ కు అనూహ్య స్పందన..
ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా రూపొందిన ట్రైలింగ్వల్ మూవీ వసంత కోకిల. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారధ్యంలో నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా కాశ్మీర పర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. వసంత కోకిల్ అనే టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై అటు సాధరణ ప్రేక్షకులతో పాటు ఇటు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ట్రైలింగ్వల్ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలై అన్ని వర్గాల అభిమానుల ఆదరణ అందుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతంది. డైలాగ్స్ లేకుండానే కేవలం విజువల్స్ తోనే ఆద్యంతం ఉత్కంఠని కలిగించే రీతిన టీజర్ ని రెడీ చేయడం విశేషం. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది. సినిమా జానర్ కి, బాబీ సింహా అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కి తగిన విధంగానే దర్శకుడు రమణన్ వసంత కోకిలను తెరకెక్కించారని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. జాతియ అవార్డు గ్రహిత, విలక్షణ హీరో కమలహాసన్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన వసంత కోకిల ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో మరో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించడం విశేషం. థింక్ మ్యూజిక్ వారు ఈ సినిమా ఆడియో రైట్స్ దక్కించుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు.
నటీనటులు
బాబీ సింహా, కాశ్మీర పర్ధేశీ
సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం – రమణన్ పురుషోత్తమ
మ్యూజిక్ – రాజేశ్ మురుగేశన్
డిఓపి – గోపీ అమరనాథ్
ఎడిటర్ – వివేక్ హర్షన్
ప్రొడక్షన్ డిజైన్ – నాగ్ రాజ్ ఆర్ కే
యాక్షన్ – స్టన్నర్ శామ్, స్టంట్ స్లివా
ఆడియోగ్రఫి – తాపాస్ నాయక్
కాస్ట్యూమ్ డిజైనర్ – నందిని ఎన్ కే
కొరియోగ్రఫి – ఎమ్ షరీఫ్, విజీసతీష్
ప్రొడక్షన్ ఎక్స్ క్యూటీవ్ – ఆర్ పి బాల గోపి
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూసన్ – సతీష్ సుందర్ రాజ్
లైన్ ప్రొడ్యూసర్స్ – జే విద్య సాగర్, యూ. దిలీప్ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్ – చెన్నూరు మహేందర్
ప్రొడక్షన్ మ్యానేజర్ – విశ్వనాథన్
స్టిల్స్ – శ్రీ బాలాజీ
పబ్లిసిటీ డిజైన్స్ – ట్యూనీ జాన్ 24 ఎమ్
లిరిక్స్ – చంద్ర బోస్
డైలాగ్స్ – రాజేశ్ ఏ మూర్తి
నిర్మాతలు – రజనీ తళ్లూరి, రేష్మీ సింహా